: సుందరబన్స్ లోకి అరుదైన తాబేళ్లు
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా పరిగణించే బటాగూర్ తాబేళ్లను వృద్ధి జేసేందుకు పశ్చిమ బెంగాల్ లోని సుందరబన్ అడవుల్లోని (ఈ అడవుల మూడొంతుల ప్రాంతం బంగ్లాదేశ్ లో వుండగా, ఒక వంతు మన పశ్చిమ బెంగాల్ లో వుంది) సరస్సుల్లో తాజాగా పెద్దసంఖ్యలో వాటిని విడిచిపెట్టనున్నారు. వరల్డ్ హెరిటేజ్ ప్రాజెక్టుల్లో ఒకటైన సుందరబన్ ప్రాంతం సాధారణంగా పులులకు నిలయం. వన్యప్రాణులకు రక్షిత ప్రాంతంగా దీనికి ఎంతో పేరుంది. ఇక్కడ వేట ప్రమాదం ఉండదు.
అందుకే అరుదైన తాబేళ్ల జాతిని కూడా సంరక్షించడానికి అధికారులు ఇక్కడి తటాకాల్లో విడిచిపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. పైగా ఈ బటాగూర్ తాబేళ్ల పరిరక్షణలో సుందరబన్ టైగర్ రిజర్వ్ ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది. ఇక్కడ 2012 లో 33, 2013లో 56 తాబేలు పిల్లలు పుట్టాయి.