: రాజస్థాన్ లోనూ బీజేపీదే హవా: సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే
మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పాటు, రాజస్థాన్ లోనూ బీజేపీ తన హవా కొనసాగించనున్నట్టు సీఎన్ఎన్-ఐబీఎన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కు 4.8 శాతం ఓట్లు తగ్గి 60 నుంచి 68 స్థానాల్లో విజయం సాధించవచ్చని, బీజేపీ 6.7 శాతం అధిక ఓట్లు సాధించి 115 నుంచి 120 గెలుచుకుంటుందని తన సర్వేలో పేర్కొంది. దీంతో రాజస్థాన్ లోనూ అధికారం బీజేపీ కైవసం కానుందని సర్వే తెలిపింది.