: ఒకే వేదికపై ఆసీనులైన ప్రధాని, మోడీ


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. ఈ అరుదైన సంఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతున్న ఓ సభలో చోటు చేసుకుంది. భారత తొలి ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ వస్తువులతో ఏర్పాటు చేసిన మ్యూజియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని, ప్రత్యేక అతిథిగా మోడీ హాజరయ్యారు. మ్యూజియం ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభకు వారిద్దరూ వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సభలో మోడీ ప్రసంగిస్తున్నారు.

  • Loading...

More Telugu News