: సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నా: కావూరి
తానిప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. అధిష్ఠానం, కేబినెట్ సమావేశాల్లో ఎప్పటికప్పుడు సమైక్యాంధ్రపై ప్రస్తావిస్తూనే ఉన్నామన్నారు. సీఎం కిరణ్ రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తనకు తెలియదన్నారు.