: బలరాం నాయక్, డీసీసీబీ ఛైర్మన్ మధ్య వాగ్వాదం
హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలోని పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. నవంబర్ 6న వరంగల్ లో తలపెట్టిన 'కృతజ్ఞత సభ'కు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బలరాం నాయక్, వరంగల్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో, సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు.