: కిడ్నాప్ కు ప్రయత్నించి బుక్కయిపోయారు!
పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి మండలానికి చెందిన సురేష్, టి నరసాపురం మండలం శ్రీరామవరానికి చెందిన ఓ యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నాక మనస్పర్థలు రాకుండా ఉండవుకదా..? ఆ క్రమంలోనే వీరు కూడా విడిపోయారు. దీంతో, ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. అది తట్టుకోలేకపోయిన సురేష్ మరో ఐదుగురు మిత్రులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేయడానికి పథకం వేశాడు. ఈ క్రమంలో యువతి ఇంటికి వెళ్లి 'దాహం' అని మంచినీరు అడిగి క్లోరోఫాం ముక్కు వద్ద ఉంచి, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాన్ని గమనించిన స్థానికులు వీరిని చెట్టుకి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్ కు అసలు సూత్రధారి మాత్రం స్థానికుల చేతికి చిక్కకుండా తప్పించుకుపోయాడు.