: జయలలితకు డీఎంకే లీగల్ నోటీసు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు డీఎంకే పార్టీ లీగల్ నోటీసు పంపించింది. బస్సులపై పార్టీ గుర్తు 'రెండాకుల'ను ముద్రించి జయలలిత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని డీఎంకే ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ కు కూడా డీఎంకే ఫిర్యాదు చేసింది. జయలలితతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి సెంథిల్ బాలాజి, చీఫ్ సెక్రటరీ, ఎండీలకు కూడా లీగల్ నోటీసులు పంపించింది.