: పలు రైళ్లు రద్దు, కొన్ని దారి మళ్లింపు


భారీ వర్షాలతో రైల్వేట్రాక్ లపై నీరు చేరడంతో దక్షిణమధ్య రైల్వే పదమూడు రైళ్లను రద్దు చేసింది. వాటిలో కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు, మరికొన్ని ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. మరికొన్నింటిని దారి మళ్లించగా, కొన్నింటిని సాయంత్రం నుంచి నడపనున్నారు. రద్దైన రైళ్ల వివరాలు చూస్తే.. విజయవాడ-విశాఖ రత్నాచల్ ఎక్స్ ప్రెస్, హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్, ముజఫర్ నగర్-యశ్వంతర్ పూర్ ఎక్స్ ప్రెస్, చైన్నై-హౌరా కోరమండల్ ఎక్స్ ప్రెస్, చెన్నై సెంట్రల్-హౌరా ఎక్స్ ప్రెస్, చెన్నై-హౌరా మెయిల్, తిరుపతి-కోల్ కతా సంత్రాగచ్చి ఎక్స్ ప్రెస్ం, కోల్ కతా షాలిమార్- యశ్వంతర్ పూర్ ఎక్స్ ప్రెస్, గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్ ప్రెస్ , కాకినాడ-విశాఖ, విశాఖ-కాకినాడ, రాజమండ్రి-విశాఖ, విశాఖ-రాజమండ్రి రద్దయ్యాయి. ఇక హజ్రత్ నిజాముద్దీన్-విశాఖ లింక్ ఎక్స్ ప్రెస్ విజయవాడ వరకు పరిమితం చేశారు.

  • Loading...

More Telugu News