: 'వర్ణ' భరితంగా ఆడియో ఆవిష్కరణ


అందాలనటి అనుష్క ప్రధాన పాత్ర పోషించిన 'వర్ణ' సినిమా నేడు ఆడియో ఆవిష్కరణ జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని శిల్పకళా వేదిక ఆతిథ్యమిస్తోంది. ఈ ఫంక్షన్ కు హీరో ఆర్య, దర్శకుడు సెల్వరాఘవన్, నిర్మాత పరమ్ వీ పొట్లూరి తదితరులు హాజరయ్యారు.

ఆర్య హీరోగా, అనుష్క ద్విపాత్రాభినయం చేసిన ఈ సోషియో ఫాంటసీ సినిమాను రూ.60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. పీవీపీ సినిమా బ్యానర్ పై పరమ్ వీ పొట్లూరి నిర్మించిన ఈ ద్విభాషా చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకుడు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. అనుష్క గృహిణిగానూ, అటవికురాలిగానూ కనిపించనుంది. ఈ చిత్రాన్ని వచ్చేనెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, 'వర్ణ'లో విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్దపీట వేసినట్టు నిర్మాత తెలిపారు. యూరప్ లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయని వివరించారు. ఈ చిత్రం తమిళంలో 'ఇరండామ్ ఉళగం'గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News