: మోడీని లక్ష్యంగా చేసుకునే పాట్నా పేలుళ్ళు: బీజేపీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకునే బీహార్ రాజధాని పాట్నాలో పేలుళ్ళు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ ప్రతినిధి మీనాక్షి లేఖి నేడు కోల్ కతాలో మాట్లాడుతూ, బీజేపీ సభకు విఘాతం కలిగించేందుకే పేలుళ్ళకు పాల్పడ్డారనడంలో ఎలాంటి సందేహంలేదన్నారు. ఈ వరుస పేలుళ్ళను 'మోడీపై జరిగిన ప్రత్యక్ష దాడి'గానే భావిస్తున్నామని తెలిపారు. ఈ దాడులకు బీహార్ సర్కారు, కేంద్రం బాధ్యత వహించాలని లేఖి డిమాండ్ చేశారు. యూపీఏ సర్కారు అసమర్థతే బాంబు పేలుళ్ళకు, తద్వారా ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైందని విమర్శించారు.