: రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: హరీశ్ రావు
భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను టీఆర్ఎస్ బృందం నేడు పరిశీలించింది. గజ్వేల్ ప్రాంతంలో పర్యటించిన టీఆర్ఎస్ నేతలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షం కారణంగా రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హరీశ్ రావు కోరారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇన్ పుట్ సబ్సీడీగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.