: ప్రధాని పదవి కోసమే నితీశ్ కాంగ్రెస్ తో చేయి కలిపారు: మోడీ
బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షతోనే నితీశ్ కాంగ్రెస్ తో చేతులు కలిపారని ఆరోపించారు. 'నితీశ్ ఓ మోసకారి' అని విమర్శించారు. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న హుంకార్ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-జేడీయూ పాలనలో బీజేపీ వల్లే బీహారీలకు ఎక్కువగా మేలు జరిగిందని నరేంద్ర మోడీ చెప్పారు. యాదవుల సంక్షేమం బాధ్యతను తాను స్వీకరిస్తానని మోడీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.