: బుద్ధుడు, మహావీర్ లాంటి మహోన్నతులను ఇచ్చిన పుణ్యభూమి బీహార్: మోడీ


హుంకార్ సభలో నరేంద్ర మోడీ బీహారీలను ఆకట్టుకునే రీతిలో ప్రసంగిస్తున్నారు. బుద్ధుడు, మహావీర్ లాంటి వ్యక్తులను ఇచ్చిన పుణ్యభూమి బీహార్ అని కీర్తించారు. బీహార్ సీఎం నితీశ్ తనకు మంచి మిత్రుడని, అయితే, ఆయన కాంగ్రెస్ తో చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. బీహార్ ను అటవిక పాలన నుంచి కాపాడడమే లక్ష్యంగా బీజేపీ పని చేసిందని చెప్పారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగిస్తేనే దేశం పురోగమిస్తుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News