: విశాఖ జిల్లాలో వర్షాలపై మంత్రి గంటా సమీక్ష


విశాఖ జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షం కారణంగా విశాఖ నగరంలో రూ.25 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. 15 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలో ప్రస్తుతం 7,200 మంది ఆశ్రయం పొందుతున్నారని వివరించారు. ఇక, అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కన్నబాబు, వెంకటరామయ్య, రమేశ్ బాబు, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News