: మరో రెండు చోట్ల బంగారం నిక్షేపాలు!
మరో రెండు ప్రాంతాల్లో బంగారం నిక్షేపాల కోసం తవ్వకాలు జరపాల్సిందింగా కేంద్ర మంత్రి చరణ్ దాస్ మహంత్ కేంద్ర సాంస్కృతిక శాఖకు ఒక లేఖ రాశారు. అది కూడా సాధువు శోభన్ సర్కార్ చెప్పిన వివరాల ఆధారంగానే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో ప్రాంతంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సాధువు అదంపూర్ గ్రామంలోనూ, కాన్పూర్ లోనూ బంగారం నిక్షేపాలు ఉన్నట్లు చెప్పడంతో.. ఇక్కడా తవ్వకాలు జరిపించాలని మంత్రి చరణ్ దాస్ కోరారు.