: తాడేపల్లిగూడెంలో భారీవర్షం


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాత్రి భారీవర్షం కురిసింది. దీంతో, పలు కాలనీలలోకి వరదనీరు చేరింది. మండలంలోని పెద్ద తాడేపల్లిలో చెరువుకు గండి పడింది. ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సమీప గ్రామాల ప్రజలకు అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News