: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 6న మొదలవనున్నఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 23వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 19 లక్షల మంది విద్యార్థులు ఈ వార్షిక పరీక్షలకు హాజరవుతారని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2633 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.