: పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళెక్కడి నుంచి ఇస్తారు: జగన్
సమైక్య శంఖారావం సభలో జగన్ పలు సమస్యలను ఎత్తి చూపుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని.. విభజన జరిగి రాష్ట్రం రెండు ముక్కలైతే ఆ ప్రాజెక్టుకు నీళ్ళెక్కడి నుంచి తెస్తారని జగన్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడడం సరికాదన్నారు. పార్టీలు నిజాయతీ లేకుండా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఓట్లు, సీట్ల కోసం ఒకరు ఇష్టానుసారం మాట్లాడతారని.. ఓట్లు, సీట్ల కోసం మరొకరు ఏమీ మాట్లాడకుండా ఉంటారని వ్యాఖ్యానించారు. వీరిని చూసినప్పుడల్లా, వీళ్ళా నాయకులని బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.