: ఉద్యమాన్ని తలకెత్తుకుంది వైఎస్సార్సీపీనే:విశ్వరూప్


సమైక్య శంఖారావం సభలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన జరిగి నేటికి 87 రోజులైందని, జూలై 30 న యూపీఏ కోర్ కమీటీ సమావేశంలో, వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో వ్యవస్థ స్థంభించిపోయిందని గుర్తుచేశారు. సీమాంధ్రలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల్ని, ఉద్యమాన్ని ఎన్జీవోలు, ఉపాధ్యాయ, విద్యార్థి, ఆర్టీసీ, విద్యుత్ జేఏసీలు ఉద్యమం ద్వారా ప్రతిబింబించారని విశ్వరూప్ తెలిపారు. ఉద్యోగులు జీతాలు, జీవితాలు మానుకుని ఉద్యమాన్ని నడిపించారన్నారు. 70 రోజుల పాటు ఉద్యమంలో వీరు పోషించిన పాత్ర అద్వితీయమని కొనియాడారు.

ఓవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడం, మరోవైపు ఫైలిన్ తుపాను కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన శూన్యతను రాజకీయపార్టీలు పూరించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. అలాంటి సమయంలో వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని తలకెత్తుకుందని ఆయన వివరించారు. విభజనకు కాంగ్రెస్ పునాది వేస్తే, దానికి టీడీపీ బ్లాంక్ చెక్కిచ్చిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని నడిపించగల వ్యక్తి జగన్ అని విశ్వరూప్ తెలిపారు. తెలంగాణలో కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, ప్రతికూల వాతావరణంలో కూడా తరలివచ్చిన జనవాహినికి కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News