: కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల కన్వీనర్ గా జైరాం రమేశ్


కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జైరాం రమేశ్ ను లోక్ సభ ఎన్నికల కన్వీనర్ గా కాంగ్రెస్ నియమించింది. దాంతో, ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, పార్టీ వ్యూహాన్ని జైరాం పర్యవేక్షిస్తారు. గతంలో 2004,09 ఎన్నికల సమయంలో పార్టీ తరపున ఎన్నికల ఇన్ ఛార్జ్ గా జైరాం పనిచేశారు. అంతేగాక, ఈ రెండు సమయాల్లో పార్టీని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేసిన ఘనత జైరాందే. ఈ నేపథ్యంలోనే ఆయనకీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News