: విచక్షణతో ఆలోచించండి: జ్యోతుల నెహ్రూ
యావత్ ఆంధ్ర రాష్ట్రం ఏకమవ్వడానికి కారణమేంటని వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. సమైక్య శంఖారావంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు కోరుతున్న కోరికను కాదని కొంతమంది రాజకీయ వేత్తలు కోరిన వాదాన్ని ఎలా అమలు పరుస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విభజన నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళుతున్నారని మండిపడ్డారు. పాలకుల అసమర్ధత వల్లే తెలుగుతల్లిని చీల్చాల్సి వచ్చిందని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏర్పడిన రాష్ట్రాన్ని రాజకీయాలకోసం ముక్కలు చేస్తున్నారని నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా కాకుండా, విభజన అవసరమా? అని విచక్షణతో ఆలోచించాలని ఆయన సూచించారు.