: స్టేడియం గేట్లను మూసేసిన పోలీసులు
ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్టేడియం మొత్తం ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయింది. లోపల స్థలం లేకపోవడంతో... పోలీసులు స్టేడియం గేట్లన్నటినీ మూసేశారు. దీంతో, వైసీపీ కార్యకర్తలు స్టేడియం బయట భారీ సంఖ్యలో గుమికూడారు. ప్రస్తుతం సభా ప్రాంగణంలో వైకాపా నాయకులు ప్రసంగిస్తున్నారు. మరికొద్ది సేపట్లో వైసీపీ అధినేత జగన్ లోటస్ పాండ్ నుంచి బయల్దేరి సభకు రానున్నారు.