: భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలో రూ. 220 కోట్ల నష్టం
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్గొండ జిల్లా నిండుకుండలా మారింది. 60 వేల హెక్టార్లలో వరి, పత్తి, మిరప, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 1850 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు దాదాపు రూ. 220 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా... ఐదు పశువులు చనిపోయాయి. వర్షాల కారణంగా జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.