: హిందాల్కో ఫైళ్లను సీబీఐకి అప్పగించిన పీఎంవో
బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందాల్కో సంస్థకు సంబంధించిన ఫైళ్లను ప్రధాని కార్యాలయం సీబీఐకి అప్పగించింది. సంచలనం సృష్టించిన ఈ స్కాంలో హిందాల్కోకు కేటాయించిన బొగ్గు క్షేత్రాలకు సంబంధించిన ఫైళ్లు కావాలని పీఎంవోను కోరుతూ మూడు రోజుల కిందట సీబీఐ లేఖ రాసింది. స్పందించిన ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఫైళ్లను అప్పగించింది.