: విజయ్ మాల్యాపై బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారుల కేసు


లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యూజర్ చార్జీలతోపాటు, వినియోగదారుల సేవా రుసుము చెల్లించలేదన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని బెంగళూరు అసిస్టెంట్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. 2008-12 సంవత్సరాల మధ్య చెల్లించాల్సిన 208 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో, మాల్యా, కింగ్ ఫిషర్ సంస్థలపై సెక్షన్ 403, సెక్షన్ 406, 418, 120 బి కింద కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News