: వీరూకు దాదా బాసట
విధ్వంసక బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ కు మాజీ సారథి సౌరవ్ గంగూలీ బాసటగా నిలిచాడు. దేశవాళీ క్రికెట్ ఆధారంగా వీరూ ఫామ్ పై ఓ నిర్ణయానికి రాలేమని చెప్పుకొచ్చాడు. వీరూ టెస్టు రికార్డులే అతని ఆటతీరును చాటి చెబుతాయని పేర్కొన్నాడు. 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ తన అభిప్రాయాలు వెల్లడించాడు. వచ్చే ఏడాది భారత్ విదేశీ గడ్డపై 13 టెస్టులు ఆడనుందని, ఆ మ్యాచ్ లలో టీమిండియాకు అనుభవమున్న ఆటగాళ్ళ అవసరం ఎంతో ఉంటుందని దాదా అభిప్రాయపడ్డాడు. వీరూతో పాటు జహీర్ కూడా ఇలాంటి పర్యటనల్లో భారత్ కు ఉపయుక్తంగా ఉంటారని చెప్పాడు. వారిద్దరి కెరీర్ ముగిసిందని తాను భావించడంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు.