: మలి విడతలోనూ మంచి ఫలితాలు: బొత్స
సహకార ఎన్నికల రెండో దశలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ చెప్పారు. రైతులు కాంగ్రెస్ వెంటే వున్నారని చెప్పడానికి తొలి విడత సహకార ఎన్నికల్లో తమ పార్టీకి 60 స్థానాలు రావడమే నిదర్శనమని చెప్పారు. ప్రతి పక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేని పోని అపోహలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను రైతులు అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇందుకు వారికి బొత్స కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు తోడుగా ఉంటామని ప్రకటించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.