: 'న్యూయార్క్ టైమ్స్'పై చైనా హ్యాకర్ల ఎటాక్


ప్రముఖ వార్తాపత్రిక 'న్యూయార్క్ టైమ్స్' కంప్యూటర్లపై హ్యాకర్లు దాడి చేశారు. చైనా ప్రధాని వెంజీ బావో బంధువులు అక్రమ ఆస్తులు కూడ బెట్టుకున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాలు ఇస్తున్న నేపథ్యంలో ... ఆగ్రహించిన చైనా హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఇందుకు సమబంధించి సదరు పత్రిక ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలోని వివిధ యూనివర్సేటీల కంప్యూటర్లను ఉపయోగిస్తూ, వైరస్ ద్వారా చైనా హ్యాకర్లు ఈ దాడి చేసినట్టు పత్రిక చెబుతోంది. ఈ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను కూడా హ్యాకర్లు తస్కరించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే, చైనా విదేశాంగ, రక్షణ శాఖలు మాత్రం దీనిని ఖండించాయి. న్యూయార్క్ టైమ్స్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందనీ, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదనీ ఆ వర్గాలు తెలిపాయి.    

  • Loading...

More Telugu News