: తమ సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకుల ధర్నా


పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ధర్నా చేపట్టింది. హైదరాబాద్ నాంపల్లిలోని భూ పరిపాలన శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట వారు ధర్నా చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని 8 నెలల క్రితం హామీ ఇచ్చి దాన్ని పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, కనీస వేతనాలు పెంచకుండా తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని వాపోయారు. వేతనాన్ని పెంచాలని, అర్హత కలిగిన వారిని వీఆర్వోలుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News