: 'రెండాకులు' తెచ్చిన తంటా
రెండాకులు.. తమిళనాడులో ఏఐఏడీఎంకే పార్టీ చిహ్నం. ఈ రెండాకుల చిహ్నం వల్ల ముఖ్యమంత్రి జయలలిత సర్కారు శాసనసభలో డీఎంకే నుంచి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం చెన్నై నగరంలో జయలలిత మినీ బస్సులను ప్రారంభించారు. వీటిపై ఏఐఏడీఎంకే పార్టీ చిహ్నం రెండాకుల గుర్తును ముద్రించారు. దీనిని డీఎంకే సభ్యులు శాసనసభలో లేవనెత్తారు. ఈ బస్సులు తమిళనాడు ప్రభుత్వానివా? లేక ఏఐఏడీఎంకే పార్టీకి చెందినవా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలలో పార్టీ చిహ్నాలు వాడరాదని డీఎంకే సభ్యుడు దురై మురుగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.