: ఆంధ్రప్రదేశ్ విభజనపై సాయంత్రం హోం శాఖ కీలక భేటీ
రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు కీలక భేటీ జరగనుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు హాజరు కానున్నారు. విభజన ప్రక్రియపై అనుసరించాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చిస్తారు. కాగా, డిసెంబర్ లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోగా తెలంగాణ బిల్లు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు.