: ఎక్కువమంది వార్తలు ఇలా తెలుసుకుంటున్నారట


వార్తలను ఎలా తెలుసుకుంటారు... వార్తాపత్రికలు చదవడం వల్ల, లేదా టీవీ చూడడం వల్ల! అలాకాకుండా ఇప్పుడు ఈ`పేపర్‌ల వల్ల కూడా వార్తలు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతోంది. కానీ ఎక్కువమంది ఇలాంటివి కాకుండా ఫేస్‌బుక్‌లో వార్తలను చదువుతున్నారట. అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఫేస్‌బుక్‌లోనే వార్తలు చదువుతున్నారని ప్రత్యేక అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్‌బుక్‌లో తమ పరిచయస్తులు, స్నేహితులు ఉంచిన అప్‌డేట్స్‌ ఆధారంగా ఎక్కువమంది వార్తలను తెలుసుకుంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది.

వ్యూ రీసెర్చ్‌, నైట్‌ ఫౌండేషన్‌ జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బాలలు కాకుండా 64 శాతం మంది అమెరికన్లు ఫేస్‌బుక్‌లో సభ్యులుగా ఉన్నారని, వీరిలో 32 శాతం మంది ఫేస్‌బుక్‌ వార్తల వాడకందారులేనని ఈ అధ్యయనం తెలిపింది. అయితే వార్తలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవారు మాత్రం ఫేస్‌బుక్‌ వార్తలపై ఎక్కువగా ఆధారపడడం లేదని, ఈ వార్తలను ఎక్కువగా 18 నుండి 29 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా చదువుతున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది.

  • Loading...

More Telugu News