: మీ పిల్లలు బరువు ఎక్కువగా ఉన్నారా?
మీ పిల్లలు ఎక్కువ బరువున్నారా... అయితే వారి బరువు తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే, చిన్నప్పుడే బరువు ఎక్కువగా ఉంటే దాని ప్రభావం వయసు పెరిగే కొద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నతనంలోనే వారికి ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పడం ద్వారా బరువు తగ్గించే ప్రయత్నం చేస్తే మంచిది.
పిల్లలు ఎక్కువ బరువు ఉంటే అలాంటి పిల్లలకు స్వీట్లు, జామ్‌లు వంటి వాటిని తగ్గించండి. కూల్ డ్రింక్స్ ని సాధ్యమైనంతవరకూ పిల్లలకు దూరంగా ఉంచండి. వంటల్లో ఎక్కువగా నూనెలను వాడటం, నెయ్యి వాడకాన్ని తగ్గించాలి. బయటి ఆహారాన్ని తినకుండా, ఇంట్లోనే చక్కగా తాజాగా తయారుచేసుకున్న ఆహారాన్ని తినేలా చూడాలి. బేకరీ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడాన్ని తగ్గించాలి. ఇవి బరువును ఎక్కువగా పెంచుతాయి. వీటిలో కొవ్వుపాళ్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని తగ్గించి పీచు ఎక్కువగా ఉండే ఆహారాలను, ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలను తీసుకుంటే మీ పిల్లలేకాదు మీరు కూడా చక్కగా బరువు తగ్గుతారు.