: బొమ్మ తుపాకీ పట్టుకున్న బాలుడిని కాల్చి చంపిన పోలీసులు


బొమ్మ తుపాకీ పట్టుకోవడమే ఆ 13 ఏళ్ల బాలుడి పాలిట పెను శాపమైంది. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు దాన్ని నిజమైన తుపాకీగా భావించి... తుపాకీని కింద పడేయాలంటూ కాల్పులు జరిపారు. దీంతో, ఆ బాలుడు కుప్పకూలిపోయాడు. అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా దగ్గర్లో ఉన్న శాంటారోసా పట్టణంలో జరిగింది. అమెరికాలో చిన్నారులు తుపాకులతో ఎడాపెడా కాల్పులు జరుపుతూ పలువురి ప్రాణాలు తీసేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకునే తుపాకీ చేతబట్టిన బాలుడు ఏ అఘాయిత్యం చేస్తాడోనని పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై శాంటారోసా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News