: 'సమైక్య శంఖారావం' ఆంధ్రప్రదేశ్ సంస్మరణ సభలాంటిది: బైరెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై రాయలసీమ పరిరక్షణ సమితి తీవ్ర ఆరోపణలు చేసింది. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనలో సోనియా పాత్ర 10 శాతం ఉంటే, వైఎస్ కుటుంబం పాత్ర 90 శాతం ఉందని అన్నారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చింది వైఎస్సేనని బైరెడ్డి గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ సమైక్య శంఖారావం సభ ఆంధ్రప్రదేశ్ సంస్మరణ సభ లాంటిదేనని ఆయన అన్నారు. కాగా, వైఎస్సార్సీపీ సమైక్య శంఖారావం సభకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు రాయలసీమ పరిరక్షణ సమితి ఆరోపించింది.