: వాగులో చిక్కుకున్న ప్రయాణీకులు సురక్షితం


ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎదురాలపాడు వద్ద మూసీవాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణీకులను ఎట్టకేలకు కాపాడారు. కొత్తపల్లి, ఎదురాలపాడు గ్రామస్తులు తాళ్ల సాయంతో మూడున్నర గంటల పాటు శ్రమించి బాధితులను ఒడ్డుకు చేర్చారు. తహశీల్దార్ పద్మావతి, దర్శి డీఎస్పీ వెంకటలక్ష్మీ, పొదిలి సీఐ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా, వీరిని కాపాడాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News