: దిగ్విజయ్ తో గవర్నర్ భేటీని తప్పుబట్టిన యనమల
ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న (బుధవారం) రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను గవర్నర్ నరసింహన్ కలవడాన్ని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. దిగ్విజయ్ ను గవర్నర్ కలవడం విధి నిర్వహణలో భాగమేనా? అని ప్రశ్నించారు. అధికారిక దస్త్రాలతో గవర్నర్ కాంగ్రెస్ నేతల ఇళ్లకు ఎలా వెళతారన్నారు. తెలుగుజాతిపై నరసింహన్ ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారా? అని నిలదీశారు. కాగా, కేసు విచారణ, అనర్హత వేటును చూపి జగన్ ను సోనియా గుప్పిట్లోకి తెచ్చుకున్నారని హైదరాబాదు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యనమల తీవ్రంగా విమర్శించారు.