: పోలవరం టెండర్లపై హైకోర్టులో పిటిషన్
వివాదాస్పద పోలవరం టెండర్లు మళ్లీ ట్రాన్స్ ట్రాయ్ సంస్థకే కేటాయించడంపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ట్రాన్స్ ట్రాయ్ కే టెండర్లు అప్పగిస్తూ రెండురోజుల క్రితం ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. అనంతరం సీఎం కిరణ్ ఆదివారం దీనికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.