: వర్షంతో నిలిచిన పలు రైళ్లు, కొన్ని రద్దు
రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పలు రైళ్లు నిలిచిపోగా, కొన్ని రద్దయ్యాయి. తిరుపతి-పూరి విశాఖ ఎక్స్ ప్రెస్, విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లను అధికారులు శ్రీకాకుళం జిల్లాలో నిలిపివేశారు. సికింద్రాబాద్-హౌరా మధ్య నడిచే పలు రైళ్ళను దారి మళ్ళించారు. అంతేగాకుండా, విల్లుపురం-ఖరగ్ పూర్ ఎక్స్ ప్రెస్ ను బిలాస్ పూర్, నాగపూర్, ఖాజీపేట మీదుగా మళ్లించారు. షాలిమార్-నాగర్ కోయిల్ ఎక్స్ ప్రెస్ ను బిలాస్ పూర్, నాగ్ పూర్, ఖాజీపేట మీదుగా.. ఈస్ట్ కోస్ట్, కోరమాండల్, హౌరా-యశ్వంత్ పూర్ రైళ్లను తిట్లాఘర్, అంగుల్ మీదుగా దారి మళ్లించారు. అటు, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం గొలుత్రి వద్ద రైల్వే ట్రాక్ పై వరదనీరు చేరడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.