: ప్రాణాపాయంలో ఉన్నారు, హెలికాప్టర్ సహాయంతో రక్షించండి : చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు ఫోన్
ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎదురాళ్లపాడు వద్ద మూసీ వాగు పొంగి పొర్లుతోంది. ఈ ఉదయం వరద ఉద్ధృతికి వాగులో ఒక బస్సు చిక్కుకుపోవడంతో ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఎనిమిది మంది బస్సుపైకి ఎక్కి రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిస్పందించారు. చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసిన ఆయన... ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ఎనిమిది మందిని హెలికాప్టర్ సహాయంతో రక్షించాలని కోరారు.