: హర్షవర్ధన్ ఢిల్లీ మన్మోహన్: కేజ్రీవాల్


బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ పై 'ఆమ్ ఆద్మీ' పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. హర్షవర్ధన్ ఢిల్లీ మన్మోహన్ సింగ్ అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలోని అవినీతిని నియంత్రించడంలో మన్మోహన్ ఎలా విఫలమయ్యారో... న్యూఢిల్లీ నగరపాలక సంస్థలో అవినీతిని అరికట్టడంలో హర్షవర్ధన్ కూడా అలాగే ఫెయిలయ్యారని విమర్శించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ ఎలాగో... ఢిల్లీ బీజేపీ శాఖలో హర్షవర్ధన్ కూడా అలాగేనని చెప్పారు. తనకంటిన అవినీతి మరకను తొలగించుకునేందుకే హర్షవర్ధన్ ను బీజేపీ తెరపైకి తీసుకువచ్చిందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. 2010లో ఢిల్లీ సీఎంగా ఎన్నికైన షీలా దీక్షిత్ ను హర్షవర్ధన్ మెచ్చుకున్నారని.. ఇప్పుడు ఆమెపైనే ఆయన ఎలా పోటీచేస్తారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News