: హడలెత్తించిన షమి.. ఓపెనర్లను కోల్పోయిన ఆసీస్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. బెంగాల్ పేసర్ షమి వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ ఫించ్(5) అవుటయ్యాడు. అనంతరం, ఆరో ఓవర్లో షమి మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ హ్యూస్ (11) ను బలిగొన్నాడు. కాగా, 6 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 2 వికెట్లకు 27 పరుగులు కాగా.. క్రీజులో వాట్సన్ (9 బ్యాటింగ్), కెప్టెన్ బెయిలీ (0 బ్యాటింగ్) ఉన్నారు.