: ముఖేశ్ అంబానీ చికెన్ బిజినెస్


ప్రపంచ కుబేరులలో ఒకడైన ముఖేశ్ అంబానీ చికెన్ రెస్టారెంట్ల వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ రిటైల్ వంటి బడా కంపెనీలకు యజమాని అయిన ముఖేశ్ అందివచ్చిన ఏ వ్యాపార అవకాశాన్నీ వదులుకోరాదన్న అభిప్రాయంలో ఉన్నారు. అందుకే, ఏటా 30 శాతం వృద్ధికి అవకాశం ఉన్న చికెన్ రెస్టారెంట్ల వ్యాపారాన్ని బ్రిటన్ కు చెందిన ఓ కంపెనీ భాగస్వామ్యంతో ప్రారంభించే ప్రణాళికల్లో ఉన్నారు. కేఎఫ్ సీ తరహా స్టోర్లు అన్నమాట. ముఖేశ్ అంబానీ పూర్తిగా శాకాహారి. అయినా, అలవాట్లు వేరు వ్యాపారం వేరు అని అనుకోవాలేమో.

  • Loading...

More Telugu News