: కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన సిరిమానోత్సవం
ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పైడితల్లి సిరిమానోత్సవం ప్రశాంతంగా ముగిసింది. విజయనగరంలో ఈ ఉత్సవం సందర్భంగా అల్లర్లు జరగకుండా కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు నగరం మొత్తం పహారా కాశాయి. నగరంలో 144 సెక్షన్ విధించారు. భారీ భద్రత, పోలీసు ఆంక్షల మధ్య పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించారు. దీంతో, ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య బాగా తగ్గింది. ఉత్సవానికి పూసపాటి రాజవంశం నుంచి అశోక్ గజపతిరాజు హాజరుకాగా ప్రభుత్వం నుంచి పీసీసీ చీఫ్ బొత్స హాజరయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.