: బంగ్లా విపక్ష నేతతో ప్రణబ్ భేటీ రద్దు
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ దేశ విపక్ష నేత బేగమ్ ఖలేదా జియాతో నేటి భేటీని రద్దు చేసుకున్నారు. జమాతే ఇస్లామీ నేత దెల్వర్ సయ్యద్ కు ఉరిశిక్ష విధిస్తూ స్థానిక ట్రిబ్యునల్ తీర్పునివ్వడంతో కొన్ని రోజుల నుంచి తీవ్ర అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాన్ని అధికార వర్గాలు రద్దు చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.