: పదవిని ప్రధాని ఎంజాయ్ చేస్తున్నారు: సుబ్రమణ్యస్వామి
ప్రధాని మన్మోహన్ సింగ్ పదవిని హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్టుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోతుంటే ప్రధానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన విమర్శించారు. రూపాయి క్షీణతకు యూపీఏ విధివిధానాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. ఎంత త్వరగా లోక్ సభ ఎన్నికలకు వెళితే అంత త్వరగా దేశాన్ని కాపాడుకోగలమని ఆయన సూచించారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని వచ్చిన వెంటనే, ఆయనతో లోక్ సభ ఎన్నికల అంశంపై రాష్ట్రపతి చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.