: కూలీ అవతారమెత్తిన తిరుపతి ఎమ్మెల్యే
రాష్ట్ర విభజనను నిరసిస్తూ తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి కూలీ అవతారమెత్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆయన ప్రయాణికుల లగేజి మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ద్రోహులు కిరణ్, చంద్రబాబులేనని ఆరోపించారు. సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న భూమన ఇప్పటికే బూట్ పాలిష్ చేయడం, రిక్షా తొక్కడం, పశువులను కాయడం, బుట్టలు అల్లడంలాంటి కార్యక్రమాలతో తన నిరసనను పలు రూపాల్లో వ్యక్తం చేశారు.