: ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలుస్తాం: గంటా
ఈ నెల 24, 25 తేదీల్లో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దిగ్విజయ్ సింగ్ లను కలుస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విభజనపై దిగ్విజయ్ రోజుకో మాట మాట్లాడుతున్నారన్న గంటా, కేంద్రమంత్రుల ప్రకటనలతో అందరిలో గందరగోళం నెలకొందన్నారు. అటు, తెలంగాణ బిల్లుకు మద్దతుపై బీజేపీ పునరాలోచనలో పడిందన్నారు.