: జీవవైవిధ్య సదస్సు నిర్వహణలో అక్రమాలు!


రాష్ట్రం గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 11వ జీవవైవిధ్య సదస్సు నిర్వహణలో పలు అక్రమాలు చో్టు చేసుకున్నట్టు వెల్లడైంది. ఈ సదస్సు నిర్వహణకు మొత్తం 1000 కోట్ల రూపాయిల ప్రతిపాదనలు పంపగా ముఖ్యమంత్రి కార్యాలయం రూ. 273. 56 కోట్లు మంజూరు చేసింది. భద్రత కోసం రూ. 70 కోట్లు జీహెచ్ఎంసీకి  రూ. 100 కోట్లు ఇచ్చారు. 

అయితే సదస్సు ఏర్పాట్లు అన్నీ లోపభూయిష్టంగా ఉన్నట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సదస్సు ముగిసి నెలలు గడిచినా కొన్ని పనులు ఇంకా కొనసాగడం అధికారుల నిర్లక్ష్యాన్నిసూచిస్తున్నాయి. రూ. 70 కోట్లు ఖర్చు చేసిన పోలీసు విభాగం వివరాలు అందించేందుకు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్ల కాంట్రాక్టులు దక్కించుకున్న పలు సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు పలు స్వచ్ఛంద సంస్థలు ఎలుగెత్తాయి. 

  • Loading...

More Telugu News