: సీఎంకు చట్టాలపై అవగాహన లేదు: ఈటెల


తెలంగాణను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి అజ్ఞానంతో వ్యాఖ్యానిస్తున్నారని... ఆయనకు చట్టాలపై అవగాహన లేదని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. సీఎం కిరణ్ తెలంగాణ ప్రక్రియను అడ్డుకోలేరని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారని... ఇంకా సీఎం ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ఈటెల ప్రశ్నించారు. రాష్ట్రాల ఏర్పాటు బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదని ఈటెల దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News